మతమార్పిడి చేస్తే బుల్లెట్లు దింపుతాం: ఆదిలాబాద్ బీజేపీ ఎంపీ బాపూరావు

మతమార్పిడులు చేసే వారికి ఆదిలాబాద్ బీజేపీ ఎంపీ సోయం బాపూరావు తీవ్ర హెచ్చరికలను జారీ చేశారు. ఆదివాసీలను మతమార్పిడి చేస్తే బుల్లెట్లు దింపుతామని హెచ్చరించారు. ఆదిలాబాద్ లో జనజాతి సురక్ష మంచ్ ఆధ్వర్యంలో జరిగిన గిరిజన సాంస్కృతిక పరిరక్షణ సభలో ఆయన మాట్లాడుతూ... ఆదివాసీ ఆడపిల్లలను ముస్లింలు, క్రిస్టియన్లు మాయ మాటలతో మతం మారుస్తున్నారని మండిపడ్డారు. మతం మారిన ఆదివాసీలకు ఎస్టీ హోదా తొలగించాలని డిమాండ్ చేశారు. 

జ్వరం వచ్చిన ఆదివాసీలకు పారాసిటమాల్ టాబ్లెట్ వేసిన నీటిని దైవజలం అని తాగించి... ఆ తర్వాత మాయ మాటలతో మతం మారేలా చేస్తున్నారని బాపూరావు మండిపడ్డారు. ఉద్యోగాలు వచ్చిన ఆదివాసీ ఆడపిల్లలను టార్గెట్ చేస్తూ మత మార్పిడిలు జరుగుతున్నాయని చెప్పారు. ఆదివాసీలు చైతన్యవంతులై, మత మార్పిడిలను వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు.

Soyam Bapurao
BJP
Adivasis
Religion Conversions

More Telugu News